Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా ఫేవరెట్ హీరోలు అల్లు అర్జున్, మహేశ్ బాబు: సంజు శాంసన్

Sanju Samson My favorite heroes are Allu Arjun Mahesh Babu
Advertisement
  • తనకు ఇష్టమైన తెలుగు హీరోల గురించి చెప్పిన సంజు శాంసన్
  • ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టమని వెల్లడి
  • మహేశ్ బాబు స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్‌ను మెచ్చుకున్న క్రికెటర్
  • గతంలో సంజు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్
Advertisement
టీమిండియా క్రికెటర్ సంజు శాంసన్ మైదానంలో తన అద్భుతమైన ఆటతీరుతో ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 97 పరుగులతో ఒంటరి పోరాటం చేసి జట్టును గెలిపించడంతో ఒక్కసారిగా హీరో అయ్యాడు. ఈ నేపథ్యంలో ఆయన వ్యక్తిగత విషయాలపై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలో, గతంలో తనకు ఇష్టమైన తెలుగు హీరోల గురించి సంజు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఓ ఇంటర్వ్యూలో భాగంగా సంజు శాంసన్ టాలీవుడ్ హీరోలపై తన అభిమానాన్ని పంచుకున్నాడు. తనకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టమని, తాను మలయాళీ అయినప్పటికీ ఆయన సినిమాలన్నీ చూస్తానని తెలిపాడు. అలాగే సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా తన ఫేవరెట్ హీరో అని చెప్పాడు. మహేశ్ బాబు స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంటాయని ప్రశంసించాడు. గతంలో మహేశ్ పుట్టినరోజున సంజు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు కూడా తెలిపాడు. 

'ఆర్ఆర్ఆర్' చిత్రంలోని 'నాటు నాటు' పాటకు ఆస్కార్ వచ్చినప్పుడు కూడా సంజు స్పందిస్తూ.. సౌత్ ఇండియన్ సినిమా గ్లోబల్ స్థాయికి చేరడం గర్వంగా ఉందని పేర్కొన్నాడు. తనకు తెలుగు మాస్ మసాలా సినిమాలు, పాటలు బాగా నచ్చుతాయని సరదాగా వ్యాఖ్యానించాడు. తాను తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు వీరాభిమానిని అని కూడా సంజు ఈ సందర్భంగా వెల్లడించాడు.
Advertisement
Advertisement
Sanju Samson
Allu Arjun
Mahesh Babu
Telugu cinema
Tollywood
Indian cricketer
RRR movie
Natu Natu song
Rajinikanth
South Indian movies

More Telugu News